మాతృదేవోభవఃపితృదేవోభవః
అనగా అనగా ఒకప్పుడు ఒక ఊరిలో ఒక గురువు గారు ఉండేవారు. వారి వద్ద కొంతమంది శిష్యులు ఉండేవారు. వారు బుద్దిమంతులు గురువు యెడల భక్తి భావం ఎక్కువగానే ఉండేవి.
ఒకరోజు శిష్యులంతా గురువుగారిని చేరి తీర్థయాత్రలకు వెళతాము అంటారు.
వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది :
*గురువు* : మీరంతా యాత్రలకు ఎందుకు వెలదామనుకుంటున్నారు.
*శిష్యులు* : మేము మరింత భక్తిని పెంచుకొని
జ్ఞానం సంపాదించు కొంటాము. అనిమనవి చేశారు.
*గురువు* : అయితే నాకు ఒకపనిచేసి పెట్టండి అని, వారికి ఒక కాకరకాయను ఇచ్చి మీరు వెళ్లిన ప్రతిచోటా ఈ కాకర కాయను తీర్థంలో ముంచి అక్కడి దేవుని పాదాలవద్ద ఉంచి తీసుకురండి అని చెబుతారు.
*శిష్యులు* : శిష్యులు వెళ్లిన ప్రతీ యాత్రా స్థలములో గురువుగారు చెప్పినట్టే ఆ కాకరకాయను తీర్థాలలో ముంచి దేవుని పాదాల దగ్గరాఉంచి కొద్ది రోజులకు
తిరిగి ఆశ్రమానికి చేరారు.
*గురువు* : ఏదీ నేను చెయ్యమన్నట్టు చేసి కాకరకాయను తెచ్చారా...అని కాకరకాయ ముక్కను తీసుకుని తిని చూచి కాకరాయ చేదు పోలేదు.. అదెలా..అన్నారు గురువుగారు
*శిష్యులు* : చేదు , కాకరకాయ సహాజలక్షణం అది ఎలాపోతుంది అంటారు శిష్యులు.
*గురువు* : అందుకే మీరైనా నేనైనా ఎవరైనా మనకు మనం ముందు మారాలి లేకుంటే ఏగురువూ ఏగ్రంధాలూ ఏ యాత్రలూ మనలను మార్చలేవు
సానుకూలముగా వింటే ధ్వని మంచి సంగీతం అవుతుంది. కదిలికలే చక్కని నాట్యమవుతుంది నవ్వే చల్లని చిరునవ్వుల జల్లు అవుతుంది.
మనస్సు ఒక ధ్యాన సమాధి అవుతుంది. అనుక్షణం భగవదార్పణమవుతుంది
ప్రతిక్షణం ఒక పండుగ లా జీవితం అవుతుంది
No comments:
Post a Comment