Showing posts with label temple. Show all posts
Showing posts with label temple. Show all posts

Wednesday, August 2, 2023

తిరువణ్ణామలై ప్రత్యేకతలు

ఎనిమిది లింగాలు దక్షిణ - యమ, పడమర - వరుణ, ఉత్తరం - కుబేరుడు, మరియు తూర్పు - ఇంద్రుడు మరియు నాలుగు ఇంటర్కార్డినల్ పాయింట్లు, ఆగ్నేయం - అగ్ని, నైరుతి - నిరుతి, వాయువ్యం - వాయు మరియు ఈశాన్య - ఈశాన్య.

శ్రీ రమణాశ్రమం: భారతీయ ఋషి అయిన శ్రీ రమణ మహర్షి యొక్క ఆశ్రమం తిరువణ్ణామలైలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. ఆశ్రమం కూడా గిరివలం మార్గంలో ఉంది మరియు భక్తులు సాధారణంగా తమ ప్రార్థనలు చేయడానికి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.

ఎస్ ఈశాద్రి స్వామిగల్ ఆశ్రమం: శ్రీ రమణాశ్రమానికి సమీపంలో ఉన్న శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం రమణ మహర్షి కంటే ఆరు సంవత్సరాల ముందు తిరువణ్ణామలైకి వచ్చిన సన్యాసి అయిన శేషాద్రి స్వామికి నిలయం.

యోగి రామ్సురత్కుమార్ ఆశ్రమం: యోగి రామ్సురత్కుమార్ కాశీ సమీపంలోని యుపికి చెందినవారు, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు. అతని చివరి స్టాప్ తిరువణ్ణామలైలో ఉంది, అక్కడ అతను మరణించే వరకు తన భక్తులను ఆశీర్వదించడం కొనసాగించాడు. ఆయన ఆశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉంది.

అరుణాచలం ఆలయానికి ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం : 
చెన్నై మరియు తమిళనాడులోని అన్ని ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాల నుండి అనేక బస్సులు నడుస్తాయి. బెంగళూరు మరియు తిరుపతి నుండి కూడా బస్సులు నడుస్తాయి.

రైలు ద్వారా :
అరుణాచలం ఆలయం సమీపంలోని రైల్వే స్టేషన్ తిరువణ్ణామలై. ఇది ఆలయానికి దాదాపు 10 కి.మీ. ఉంది.

విమానంలో : 
చెన్నై సమీపంలోని విమానాశ్రయం మరియు ఇది రోడ్డు మార్గంలో 185 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇంద్రుని ధ్వజస్ధంభం

 ఇంద్రుని ధ్వజస్ధంభం ....!!

   
🌿కడలూరు జిల్లా బన్రూటికి ప్రక్కన తిరువదికై అనే గొప్ పుణ్య క్షేత్రం. ఇక్కడ వున్న రంగనాయకీ సమేత  రంగనాధుని ఆలయంలో వున్న ధ్వజస్ధంభం అతి ప్రాచీనమైనది,మరింత విశిష్టమైనది.

🌸ఈ ధ్వజస్థంభాన్ని దేవలోకాధిపతియైన మహేంద్రుడు ఉపశిరవసు అనే మహారాజుకి కానుకగా  యిచ్చినట్లు  

🌿ఆ రాజు ధ్వజస్ధంభాన్ని
యీ ఆలయానికి భక్తితో సమర్పించి శ్రీ రంగనాయకుని, అమ్మవారిని పూజించాడని స్ధలపురాణ చరిత్ర తెలియచేస్తున్నది.

🌸మానవుల వెన్నెముకలో
32 పూసలు వున్నట్లే 
యీ ఆలయ ధ్వజస్ధంభానికి  32 కణుపులు వుండడం విశిష్టత...స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Brahma temple, pushkar

Travel guidelines by Sai saranam
-
Pushkar
Brahma Temple, Pushkar (also known as Jagatpita Brahma Mandir) is a Hindu temple situated at Pushkar in the Indian state of Rajasthan,
--
Pushkar
Pushkar in the state of Rajasthan is located 14 km away from Ajmer city. In order to reach this pilgrimage city, one can opt for the following alternatives:

By Air: Pushkar does not have an airfield of its own. Thus, if you prefer traveling by air, then Sanganer airport in Jaipur would be the closest stoppage for you. The airport is very well connected to the major cities of India like New Delhi, Mumbai and Kolkata. Jaipur city is 142 km away from Pushkar, which can be covered by via bus or hired taxi/cab.
By Rail: The best alternative to reach Pushkar is a rail journey. Pushkar does not have a railway station. However, Ajmer, which is only 15 km away from Pushkar, does have a railway connection. Ajmer railway station operates regular trains from the major cities of Rajasthan and India.
By Road: If you happen to travel by road, major roadways and national highways leading to Rajasthan must be your best deal. Pushkar has a good network of roads connected to Delhi, Jaipur, Jodhpur and Bikaner.
Temple timings:

06:30 am to 08:30 pm (winters)
06:00 am to 09:00 pm (summers)
Sandhya Aarti(40 minutes after sunset)
Ratri Shayan Aarti (5 hours after sunset)
Mangala Aarti (2 hours before sunrise

చందన వినాయకుడు దేవాలయం, గుడువాంచెరి, Chandana Ganesha, Gudvancherry, Chennai

🎻🌹🙏 చందన వినాయకుడు ఆలయం, గుడువాంచెరి, చెన్నై ..!!
      


🌸చెన్నైతాంబరం నుండి సుమారు 12 కి.మీ దూరంలో  గూడువాంచేరి వుంది.  ఒకానొకకాలంలోనందీశ్వరుడుపరమశివునిపూజించినస్ధలంయిది. అందువలన ఈ స్థలానికినందికేశ్వరం అనే పేరు కూడా వున్నది. 

🌿ప్రాచీనకాలంలో ఈ ప్రాంతమంతా
పువ్వుల తోటలతో నిండివుండేది.
ఇక్కడినుండి పువ్వులను సేకరించి మాలలు అల్లి అనేక దేవాలయాలకి పంపేవారు . అందువలన
పూయిడువాంచేరి అనే పేరు కూడా యీ ఊరుకు వున్నది. 

🌸గుడువాంజేరి రైల్వే స్టేషన్ దగ్గిర  ఒక మామిడిచెట్టు క్రింద వినాయకుడు వెలసియున్నాడు.ఈ ఊరిలో  పొగిచిన శనగలు  అమ్ముకుంటూ ఒక వృధ్ధురాలు జీవిస్తూ వుండేది.

🌿ఒకనాడు  ఆ ముసలామెకు తన శనగలు ఏవీ అమ్ముడుపోలేదు. తిరిగి తిరిగి అలసిపోయి  రైల్వేస్టేషన్ వద్ద వున్న మామిడి చెట్టు క్రింద వినాయకుని ప్రార్ధిస్తూ కూర్చున్నది.

🌸కొద్ది సేపటికి జనాలు ఒక్కొక్కరుగా వచ్చి పొగిచిన శనగలు  కొనుక్కుని వెళ్ళేరు. తెచ్చిన సరుకంతా అమ్ముడుపోయింది. మరునాటి
నుండి  దేవుని దయతో  ఆ వృధ్ధురాలి  శనగలన్నీ అమ్ముడు పోయేలా వ్యాపారం సాగింది.

🌿వృధ్ధురాలికి ఆ మామిడి చెట్టు కి ఏదో మహిమ వున్నదని అనిపించింది.
ఆనాటి  అమ్మకం పూర్తవగానే  ఆ మామిడి చెట్టుని నిశీతంగా గమనించినది. 

🌸మామిడిచెట్టుకి అడుగున వున్న వ్రేళ్ళు అన్నీ ముడిపడి వినాయకుని రూపంలో కనిపించాయి. వృధ్ధురాలు భక్తి తోపులకించి పోయింది.
గణనాధుని మనసారా ప్రార్ధించినది.

🌿ఆమెద్వారా చుట్టు ప్రక్కలవారికి ఈ విషయం వ్యాపించి ప్రజలంతా ఆ
వినాయకుని దర్శనానికి రావడం మొదలెట్టారు. క్రమేపి  అక్కడ ఒక ఆలయం వెలసినది.

🌸ఈ ఆలయంలో  ఈశ్వరుడు, లలితాంబిక,దక్షిణామూర్తికొలువుదీరారు. నారు.ఈ ఆలయంలో గణేశుడు  దక్షిణ ముఖంగాదర్శనమిస్తున్నాడు. 
ఈ భంగిమను అఘోర గణనాధ స్వరూపమనిఅంటారు. 

🌿ఈ ఆలయంలో చతుర్ధినాడు
అఘోరగణనాధ మూర్తి మూల మంత్రాన్ని  జపిస్తూ ఒక హోమం
ఘనంగా జరుపుతారు. ఈ హోమంలో పాల్గొన్నవారికి కలిగే జీవితంలో సుఖసంతోషాలు, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. 

🌸శతృవుల బాధలు , దీర్ఘకాల వ్యాధులు తొలగి పోతాయని నమ్ముతారు.. చతుర్ధినాడు
వినాయకునికి  జరిగే చందన పూత అలంకారం  చాలా విశేషంగా చేస్తారు.

🌿విఘ్నేశ్వరునికి  పూత పెట్టిన చందనం సకల వ్యాధులను గుణపరిచే
గొప్ప ఔషధమని ఐహీకం...స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Thursday, June 17, 2021

పూరీ జగన్నాథ్ ఆలయంలో సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు

*🛕పూరీ జగన్నాథ్ ఆలయంలో సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు🛕*

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నిక గన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షలసంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.

అయితే ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలూ వున్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగు తున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం. అవేంటో ఒకసారి మీరే చదవండి ...

*🛕మొదటిది... తనంతట తానే ఆగిపోయే రథం*

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం వుండదు.

*🛕రెండవది...నీడ కనిపించని గోపురం*

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు . 
ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.

*🛕మూడవది...గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా*

ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురు తుంటుంది. కానీ పూరీ ఆలయ గోపురం పైన వుండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .

*🛕నాలుగవది...మనవైపే చూసే చక్రం*

పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా అది మనవైపే చూస్తున్నట్టు వుంటుంది .

*🛕ఐదవది...ఈ ఆలయంపై ఎగరని పక్షులు*

ఇది మరో వింత. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.

*🛕ఆరవది...ఆలయం లోకి వినిపించని అలల సవ్వడి*

ఇదో విచిత్రం..సముద్ర తీరాన కొలువుతీరిన ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్రపు హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.

*🛕ఏడోది... ఘుమఘుమల ప్రసాదం*

పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసనా రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలు మంచి సువాసనతో ఘుమ ఘుమ లాడుతుంటాయి.
🛕

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...