Showing posts with label Chaitra maas. Show all posts
Showing posts with label Chaitra maas. Show all posts

Monday, April 4, 2022

మత్స్య జయంతి చైత్ర బహుళ తదియ నాడు జరుగుతుంది. Matsya Jayanti is celebrated on Chaitra Bahula Tadiya

మత్స్య జయంతి....!!*
   
 మత్స్య జయంతి చైత్ర బహుళ తదియ నాడు జరుగుతుంది.

ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం.

 కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు.

బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు.

 ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు.

 దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’అని అంటారు.

🌹మత్స్యావతారం అసలు కథ🌹

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు.

 ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. 

రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది.

 వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు.

 ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది.

 అంతట ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడుని అని , ఏడు రోజులలో ప్రళయం రానున్నదని , సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని 

, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి , అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు , బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని , సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.

మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. 

సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రశిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి.

 బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా , “సొమకాసురుడు” అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి , సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు.

 బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి …… వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొని , బ్రహ్మవద్దకు వచ్చాడు.

 శంఖాన్ని తానూ తీసుకొని , శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

*మత్స్య జయంతి విధి విధానాలు*

ఈ రోజు విష్ణుమూర్తి  ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం , ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం.

 ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే , అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది.

 మోక్షం ,ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు.

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...