Wednesday, November 8, 2023

కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన పూజ విషయాలు...

కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు...
*పూజ* :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.

*అర్చన*:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.
*జపం*:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.

*స్తోత్రం*:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

*ధ్యానం*:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.
*దీక్ష*:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.

*అభిషేకం* :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.

*మంత్రం*:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.
*ఆసనం*:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.

*తర్పణం*:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

*గంధం*:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 

అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.

*అక్షతలు*:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.

*పుష్పం*:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.
మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.
(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.

*ధూపం:*- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.

*దీపం*:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. 
పూజగదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. అగ్నిశివుడి కుమారుడైన కుమార స్వామికి ప్రతీక.

*నైవేద్యం:- మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.*

*ప్రసాదం*:-భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాల నిచ్చేది. సామ రస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం.ఏ రూపంలోని ప్రసాదాన్నైనా ప్రసాదం అని మాత్రమే వ్యవహరించాలి.ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు.అలా అనకూడదు. పులిహోర ప్రసాదం, కొబ్బరి ప్రసాదం అనవచ్చు.

*వందనం*:- అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయ వచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం,శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి. ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళ పై భగవంతుడికి వందనం చేయొచ్చు.

*ఉద్వాసన*:- ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని  ఉద్వాసనమని అంటారు. చివర్లో  ప్రార్థన , దోష  క్షమాపణ చెప్పి తీర్థ , ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయాలి.🔔

No comments:

Post a Comment

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...