భృగుమహర్షి యువనాశ్వునిచే పుత్రకామేష్టి జరిపిస్తారు. ఈ క్రమంలో మంత్రించిన నీటిని ఒక కుండ లో ఉంచుతాడు ఆ మహర్షి, అయితే అంతకు ముందు ఉపవాస దీక్ష లో ఉన్న రాజు దాహమై ఆ రాత్రి తెలియక కుండలో ఉన్న నీరు త్రాగు తాడు.
మరుసటి రోజు ఉదయాన రాత్రి జరిగిన విషయాన్నంతా భృగుమహర్షికి చెప్పాడు. అప్పుడు భృగుమహర్షి ఆయనతో ‘రాజా! ఆ మంత్రజలాన్ని నీ భార్యచే తాగించాలన్నది నా ఉద్దేశం. అప్పుడు దేవేంద్రుడు కి సమానమైన కొడుకు పుట్టే వాడు.అని ఋషి చెప్తారు.
జలాన్ని ఎవరు తాగితే వారి గర్భంలో కుమారుడు జన్మించుట తథ్యం. కాబట్టి నీ భార్య గర్భంలో జనించవలసిన వాడు నీ శరీరంలోనే జన్మిస్తాడు. ఇది తప్పదు అని చెబుతాడు.తర్వాత యువనాశ్వునకు సూర్యుని లాంటి కొడుకు పుడతాడు. దేవతల సహాయంతో మొత్తానికి కొడుకు పెరుగుతాడు .
ఇంద్రుని చూపుడు వేలు ద్వారా అమృతాన్ని తాగి క్రమంగా పెరిగి పదమూడు జేనలంత వాడయ్యాడు. అందుకే వానికి మాంధాత అని పేరు స్థిరపడింది.
చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుని అందరిలోనూ మేటిగా నిలిచేవాడు. ఇతడు ఎంతటి బలవంతుడటంటే.. 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు.
ఈయన చరిత్రలో మనం రాస్తూపోతే మరొక గ్రంథం అవుతుంది కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే
మాంధాత ఇక్ష్వాకుల రాజు అయినప్పుడు వీరి జీవితంలో అన్ని అసహజమైన సంఘటన జరుగుతాయి.
సహజంగా జననం స్త్రీల నుంచి జరుగుతుంది. కానీ మీరు పుట్టుక పురుషులనుంచి జరుగుతుంది.
సహజ పద్దతుల్లో కాకుండా ఆపరేషన్ పద్ధతి లో మీరు జననం ఉంటుంది.
తల్లిదండ్రులు పెంచవలసిన దగ్గర ఇంద్రుడు లాంటి వారి ద్వారా ఇంకా చెప్పాలంటే అందరూ పురుషులే ఇతరులను పెంచిపోతు చేస్తారు.
మాంధాత కాలంలో కరువు వచ్చినప్పుడు సహజంగా కురవలసిన వర్షాలు కురువవు అప్పుడు తన బాణాలను ప్రయోగించి వర్షాలను కురిపిస్తాడు. దీన్ని వరుణ విద్య అంటారు . క్లౌడ్ బరస్ట్ ప్రయోగాలు అప్పుడు ఉండేవి కాబోలు.
ఇంద్రుడు సింహాసనంలో అర్థ భాగం ఉన్న మూడు లోకాలను జయించిన ఇంకా ఏదో చేయాలని విపరీతంగా యుద్ధాలు చేస్తారు.
జీవితములో తృప్తి ఉండదు .అని చెప్పడానికి ఈయన జీవితం ఉదాహరణ.
ఎక్కడో అనామకంగా ఒంటరిగా తన జీవితాన్ని ముగిస్తాడు.. తృప్తి లేని జీవితం దుఖాల మయం అని సందేశాన్ని Disclaimer __
(పుస్తకాలలో చదివిన ,పెద్దల ద్వారా విన్న నాకు అర్థమైన విషయాల ద్వారా వ్రాయడం జరిగింది)
No comments:
Post a Comment