*తిరుఆదనూర్, తమిళనాడు*.
*ప్రధాన దైవం*: ఆండళక్కుంమయ్యన్
*ప్రధాన దేవత*: శ్రీరంగ నాయకి
*పుష్కరిణి*: సూర్య పుష్కరిణి
*గర్భగుడి విమానం*: ప్రణవాకార విమానము.
ఈ దివ్యదేశము స్వామిమలై క్షేత్రం నుండి కేవలం 3 కి.మీ దూరం మాత్రమే.
*స్థల పురాణం* :
కూర్మావతారమున శ్రీ మహావిష్ణువు మంథరగిరి పర్వతమును తన వీపుపై మోసి సముద్ర మధనం లో సహాయం చేయినప్పుడు., అమృతం లభించింది.
మోహిని రూపమ ధరించి, అమృతమును మరియు అంతకు ముందు లభించిన కామధేనువు (ఆవు), ఐరావతము (ఏనుగు , ఆ అమృతమును దేవతలకు మాత్రమే పంచి వారిని అమరులను చేసాడు., . ఉచ్ఛైశ్రవము (గుర్రము), కల్పవృక్షములను దేవేంద్రునకు ఇచ్చి దేవలోకమున దేవతా ముఖ్యులు తమకు నిర్దేశించిన బాధ్యతలను జగత్కళ్యాణమునకై సక్రమముగా నిర్వహించుటలో సహాయపడుటకై ఆదేశించాడు.
ఆ విధముగా ఆవిర్భవించిన కామధేనువు అను గోవు (కోరిన సర్వమును అనుగ్రహించగల్గిన మహిమాన్విత) ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి దర్శన మిచ్చిన కారణమున ఈ ఆదనూరు అని పేరు వచ్చెను ( ఆదన్ + ఊరు ) .
చరాచర సృష్టిలో సకలముల యందు పరమాత్ముడు ఉండి . సమస్త జీవుల హృదయాంతర్గతుడై ప్రతి ప్రాణి యొక్క పుణ్య , పాప కార్యములను లిఖించుచూ ఆ ప్రకారమున మాత్రమే ఫలమఫలములను అనుగ్రహించు చున్నాడు అను భావమున ఈ దివ్య దేశమున దర్శన మిచ్చుచున్నాడు .
ఇక్కడ స్వామి "ఆండు అళక్కుమ్ అయ్యన్ " అను పేరున విలువబడుచున్నాడు .
సూర్యచంద్రులే తన నేత్రములుగా కలిగి యున్న - శ్రీమన్నారాయణుడు సకల జీవుల కర్మములను గమనించు చుండును . ఆ దేవుని దృష్టి నుండి తప్పించుకొనుట ఏ ప్రాణికినీ సాధ్యము కాదు అను అర్థమున ఆదవనుల్ల ఊరు అని ఈ క్షేత్రమునకు ప్రథమమున పేరు కలిగినది .
పరమాత్ముని ఒక నేత్రము సూర్యుడు . సూర్యుడు జగత్తున ప్రత్యక్ష సాక్షి . ఆ కారణముగా ఇచ్చటి పుష్కరిణికి సూర్య పుష్కరిణి అను పేరు.
@ ఆండళుక్కుమయ్యన్ ( ఆండు + అళక్కుమ్ + అయ్యన్ ) పెరుమాళ్ తూర్పుదిశముఖముగా భుజంగశయన మూర్తి .
శ్రీ ఆండళుక్కుమయ్యన్ తిరువడిగలే శరణం🙏
No comments:
Post a Comment