Saturday, May 29, 2021

భగినీ హస్త భోజనం* *కార్తీక మాసంలో శుక్లపక్షం విదియ నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక. అన్నా చెల్లెలు పండుగ అంటారు

*భగినీ హస్త భోజనం* 
 *కార్తీక మాసంలో శుక్లపక్షం విదియ నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక. అన్నా చెల్లెలు పండుగ అంటారు. 
          *కారణం* 
        -------------
సూర్య భగవానికి ఒక కుమారుడు ఒక కుమార్తె.
వారి పేర్లు "" యమధర్మరాజు & యమున. యమునకు అన్నగారు అనగా విపరీతమైన. అభిమానం.
అమె అన్నగారు " యమధర్మరాజు"" గారిని ఎన్నో సార్లు తన ఇంటికి భోజనము నకు రమ్మని పిలిచేది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలము గడచిపోతూఉంది. అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలు ఇంటికి వెళదామని అనకున్నాడు. ఆ రోజు కార్తీక శుద్ద విదియ
"' యమధర్మరాజు "" చెల్లెలి ఇంటి వచ్చాడు. రాక రాక వచ్చిన అన్నయ్య ను చూచి
చెల్లెలు "" యమున"" సంతోషంగా అన్నయ్య. కు ఇష్టమైన. పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. "" యమధర్మరాజు "" త్రుప్తిగా భోజనము చేసి చెల్లెలు తో ప్రేమగా చెల్లీ నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా వరం ఇస్తానని చెప్పగా " యమున" అన్నయ్యా లోకకల్యాణము కోసం నాకు ఒక వరము ఇవ్వు.
ఈ రోజు న ఎవరైనా అక్క& చెల్లెలు ఇంటికి ఏ అన్నయ్య & తమ్ముడు భోజనంచేస్తాడో నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దు. ఇది నా కోరిక అనగా "" యమధర్మరాజు ""
లోకకల్యాణం కోసం అడిగావు కనుక " తధాస్తు"
అని చెల్లెలు ను దీవించి వెళ్ళాడు. అనగా రేపటి రోజున. అక్క & చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను ఉండవు. 

 *కనుక అందరు సోదరి చేతి భోజనం చేసి కనుమరుగై న బంధుత్వాన్ని కలుపుకొని సుఖముగా ఉండాలని కోరుకుంటూ...* 
__________________
🙏 *లోకాః సమస్తా సుఖినోభవంతు* 🙏

suresh
9840344634
tours agent
www.saisaranam.in

దీప వత్తుల యొక్క ఫలితములు -సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .*



దీప వత్తుల యొక్క ఫలితములు 

*1)పత్తి:-పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .* 

 *2 ) అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .*

 *2 ) జిల్లేడినార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవు ,*

*4 ) తామర నార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును . ధనవంతు లగుదురు .* 

*6 ) నూతన పసుపు వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు*

*6)నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గును*

*7 ) నూతన తెల్ల వస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును ,*

 *సాయంత్ర సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .*
🙏🙏🌻🙏🙏

దీపాల యొక్క దిక్కుల ఫలితములు

దీపాల యొక్క దిక్కుల ఫలితములు

*1 ) తూర్పు : కష్టములు తొలగును , గ్రహదోషములు పోదురు ,*

*2 ) పశ్చిమ : అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలగును ,*

*3 ) దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలును ,*

 *4 ) ఉత్తరం : ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును .*

దీపారాధన విధానం

దీపారాధన విధానం 

*1 ) నెయ్యి : నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .*

 *2 ) నువ్వుల నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును .*

*3 ) ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల శుభం , దాంపత్య సుఖం వృద్ధియగును .*

*4 ) వేరుశెనగ నూనె : వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దుఖం , చోర భయం , పీడలు మొదలగునవి జరుగును .*

*5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన , వారికి దేవీ అనుగ్రహం కలుగును .* 

*6 ) వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .*

*7 ) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి చేసిన సర్వ సుభాలు , శాంతి కలుగును

వత్తులు - దీపారాధనకు -

వత్తులు - దీపారాధనకు

*1 ) ఒక వత్తి : సామాన్య శుభం* 

*2 ) రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం* 

*3 ) మూడు వత్తులు : పుత్ర సుఖం*

*4 ) ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం , ఆయుర్ధాయం , అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము .*

*🙏ఉదయం స్నానం ఎందుకు ?🙏* *తెల్లవారు జామున 4 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్త | కాల సమయం 2 గంటలు

*🙏ఉదయం స్నానం ఎందుకు ?🙏*

 *తెల్లవారు జామున 4 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్త | కాల సమయం 2 గంటలు ఉంటుంది . ఈ రెండు గంటల కాల సమయములో | ఓజోన్ అనేటటువంటిది గాలిలో ఎక్కువగా ఉంటుంది . ఇది శరీరానికి తగలడం వలన శరీరానికి చాలా మంచిది . కనుక అందరూ తెల్లవారు జామున అనగా ఉదయం 4 నుంచి 6 గంటల లోపల స్నానం చేయాలి . అంతేకాకుండా మరియొక కారణం కూడా ఉన్నది . ఆ బ్రహ్మముహూర్త కాల సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారని , అందువలన | ధ్యానముతో భగవంతుడు సులువుగా ప్రసన్నుడౌతాడని ఆధ్యాత్మికుల అభిప్రాయం అందుకే హిందూ సాంప్రదాయకమైన దేవాలయాలన్నియు భగవంతుని మేలుకొల్పు , సుప్రభాతము మొదలగు పూజా కార్యక్రమములతో ప్రారంభమవుతూ ఆ సమయంలోనే కోవెలలన్నీ తెరువబడతాయి . సుమారు |6 లేక 7 గంటల నిద్రవలన మానవుల తనువు తేలికబడి , మనసు ఉల్లాసంగా నిర్మలముగా ఉండి వారు చేయు పని పట్ల ఏకాగ్రత కుదురుతుంది . అంతేకాక వారిని ఆటంక పరిచే నిత్యమానవ విధులేవి ఆ సమయమునంద ఆరంభము | కావు . అందువలన దీక్ష కాలమున బ్రహ్మ ముహూర్తమున నిద్రలేవి | శిరస్నానమాచరించి స్వామిని సేవించవలెనని నియమము విధించారు .*

జన్మనక్షత్రం - వెలిగించాల్సిన వత్తులు. నక్షత్రం --వత్తులు

💐💐జన్మనక్షత్రం - వెలిగించాల్సిన వత్తులు.💐💐
💐💐నక్షత్రం ----------వత్తులు💐💐

అశ్వని ---------నవ వత్తులు
భరణి --------- షణ్ముఖ వత్తులు
కృత్తిక-------- ఏక లేదా ద్వాదశ వత్తులు

రోహిణి------- ద్వి వత్తులు
మృగశిర----- త్రి వత్తులు
ఆరుద్ర------ అష్ఠమ వత్తులు

పునర్వసు-- పంచమ వత్తులు
పుష్యమి---- సప్తమ వత్తులు
ఆశ్లేష------ చతుర్‌ వత్తులు

మఖ------ నవ వత్తులు
పుబ్బ----- షణ్ముఖ వత్తులు
ఉత్తర ----- ఏక లేదా ద్వాదశ వత్తులు

హస్త------ ద్వి వత్తులు
చిత్త ------ త్రి వత్తులు
స్వాతి----- అష్ఠ వత్తులు

విశాఖ----- పంచ వత్తులు
అనూరాధ-- సప్త వత్తులు
జ్వేష్ఠ ------ చతుర్‌ వత్తులు

మూల----- నవ వత్తులు
పూర్వాషాఢ- షణ్ముఖ వత్తులు
ఉత్తరాషాఢ-- ఏక లేదా ద్వాదశ వత్తులు

శ్రవణం----- ద్వి వత్తులు
ధనిష్ఠ------ త్రి వత్తులు
శతభిషం --- అష్ఠ వత్తులు

పూర్వాభాద్ర- పంచ వత్తులు
ఉత్తరాభాద్ర-- సప్త వత్తులు
రేవతి------ చతుర్‌ వత్తులు

పై విధంగా జన్మనక్షత్ర రీత్యా దైవారాధన చేసినట్లయితే...
 సకల శుభాలు కలిగి సుఖ సౌఖ్యాలు పొందుతారు.

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...