Tuesday, October 24, 2023

॥ అపరాధ క్షమాపణ స్తోత్రం

*॥ అపరాధ క్షమాపణ స్తోత్రం ॥*
ఓం అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ |
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః || ౧ ||

సాపరాధోఽస్మి శరణం ప్రాప్తస్త్వాం జగదంబికే |
ఇదానీమనుకమ్ప్యోఽహం యథేచ్ఛసి తథా కురు || ౨ ||

అజ్ఞానాద్విస్మృతేర్భ్రాంత్యా యన్న్యూనమధికం కృతమ్ |
తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి || ౩ ||

కామేశ్వరి జగన్మాతః సచ్చిదానందవిగ్రహే |
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి || ౪ ||

సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్ |
అతోఽహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీమ్ || ౫ ||

యదక్షరం పరిభ్రష్టం మాత్రాహీనఞ్చ యద్భవేత్ |
పూర్ణం భవతు తత్ సర్వం త్వత్ప్రసాదాన్మహేశ్వరి || ౬ ||

యదత్ర పాఠే జగదంబికే మయా
విసర్గబింద్వక్షరహీనమీరితమ్ |
తదస్తు సంపూర్ణతమం ప్రసాదతః
సంకల్పసిద్ధిశ్చ సదైవ జాయతామ్ || ౭ ||

యన్మాత్రాబిందుబిందుద్వితయపదపదద్వంద్వవర్ణాదిహీనం
భక్త్యాభక్త్యానుపూర్వం ప్రసభకృతివశాత్ వ్యక్తమవ్యక్తమంబ |
మోహాదజ్ఞానతో వా పఠితమపఠితం సామ్ప్రతం తే స్తవేఽస్మిన్
తత్ సర్వం సాంగమాస్తాం భగవతి వరదే త్వత్ప్రసాదాత్ ప్రసీద || ౮ ||

ప్రసీద భగవత్యంబ ప్రసీద భక్తవత్సలే |
ప్రసాదం కురు మే దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || ౯ ||

ఇతి అపరాధక్షమాపణస్తోత్రం సమాప్తమ్ ||🙏

సూర్యుడి నుండి వచ్చే ఏడుకిరణాలు - *సప్త జ్ఞాన భూమికలు.*

🌞🌞🌞🌞

సూర్యుడి నుండి వచ్చే   
ఏడుకిరణాలు - -
*సప్త జ్ఞాన భూమికలు.*
జ్ఞానం 
జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. 
వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం. 

*(1) శుభేచ్ఛ* 
*(2) విచారణ* 
*(3) తనుమానసం*
*(4) సత్త్వాపత్తి* 
*(5) అసంసక్తి* 
*(6) పదార్ధభావని* 
*(7) తురీయం* 
🙏 ఇవి సప్త జ్ఞాన భూమికలు.

 *1) శుభేచ్ఛ :* 
నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

*2) విచారణ :* 
బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస; బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

*3) తనుమానసం :* 
ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే,  ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే తనుమానసం.

*4) సత్త్వాపత్తి :* 
శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే. తమోగుణం అంటే సోమరితనం, రజోగుణం అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం. 
ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; 
మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

*5) అసంసక్తి :* 
దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం,రెండూతాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

*6) పదార్ధభావని :* 
అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించు కుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

*7) తురీయం :* 
ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, 
సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే బుద్ధుడు అంటాం. ఇదే సహస్రదళ కమలం .ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచి నప్పుడల్లా సహస్రదళకమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.తురీయం అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం; 
అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి...

స్వస్తీ..🙏

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...