శ్రీ హయగ్రీవజయంతి
హయగ్రీవుడనే దానవుడు పరాశక్తిని గూర్చి తపస్సుచేసి తనలాంటి హయశిరస్సు కలవాడివల్లనే తనకు మరణం సంభవించాలని వరం కోరుకున్నాడు. ఆ వర గర్వంతో దేవతలను, ఋషులను బాధించసాగాడు. వేదాలను అపహరించి తనవద్ద పెట్టుకున్నాడు. దానివల్ల యజ్ఞ యాగాది వైదికకర్మలు, దేవతారాధనలు ఆగిపోయాయి. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకున్నారు. దేవతల మొర విని విష్ణువు హయగ్రీవరూపంతోనే ఆ దానవుణ్ణి సంహరిం చాడు. విష్ణువుకు హయగ్రీవరూపం రావడానికిగూడా ఒక కారణం ఉంది.
ఒకానొకసమయంలో విష్ణువు లక్ష్మిని చూసి నవ్వగా ఆవిడ అపార్థం చేసికొని, ఆయన శిరసు తెగిపోవాలని శపించింది. తరువాత విష్ణువు పదివేలసంవత్సరాలు దానవు లతో యుద్ధంచేసి అలసిపోయి ఒకచోట కూర్చుని ఎక్కు పెట్టిన ధనుస్సు యొక్క వింటికొనని కంఠానికి ఆనించుకుని తన భారమంతా దానిమీద ఉంచి నిద్రలోకి వెళ్ళాడు. ఎంతకీ ఆయనకి మెలకువ రాకపోతే, బ్రహ్మ పురుగును సృజించి వాటిని వింటినారిని కొరకడానికి ఉపయోగించాడు. అలా చేయడంవల్ల వింటినారి తెగి ఒక భయంకరమైన శబ్దం కలిగి విష్ణువు కంఠానికి ఆ నారి చుట్టుకుని తల తెగి ఎక్కడో పడిపోయింది. బ్రహ్మాదిదేవతలంతా చాలా దుఃఖపడి పరాశక్తిని ధ్యానించగా ఆ దేవి హయశిరస్సు తెచ్చి అతి కించమంది. అలా చేశాక విష్ణువు హయగ్రీవరూపంతో హయగ్రీవుడైన దానవుణ్ణి సంహరించి దేవాదులను రక్షిం చాడు.
శ్రావణపూర్ణిమనాడు శ్రీహయగ్రీవజయంతిని జరుపుకుంటారు. ఆయన జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదించే గురుస్వరూపం. ఆయన స్ఫటికంలా నిర్మలంగా ఉంటాడు. పరాపర విద్యలన్నిటికీ మూలమాదేవుడే. నాలుగు భుజాల్లో శంఖం, చక్రం, పుస్తకం, చిన్ముద్రలను ధరించి ఉంటాడు. ఆయన చేసే సకిలింపు ధ్వని బీజాక్షరాలకు ప్రతీక. ఆ ధ్వని దుష్టశక్తులను పారద్రోలుతుంది.
పరాశక్తి శ్రీలలితాదేవి తన భక్తురాలైన లోపా ముద్రను ముద్రలు లేకుండా తనను ఆరాధించవచ్చని అనుగ్రహించింది. ఆ లోపాముద్ర పతి అయిన అగస్త్య మహర్షి కలియుగమానవుల ఉద్ధరణకోసం ఏదైనా ఉపాయం తెల్పమని శ్రీహయగ్రీవుని వేడుకున్నాడు. ఆ దేవి అను మతితో శ్రీహయగ్రీవుడు శ్రీవిద్యయొక్క ప్రాముఖ్యతను అగస్త్యమహర్షికి తెలిపి, శ్రీలలితా రహస్యనామాలను ప్రసా దించాడు. దక్షిణాదిన గల కాంచీపురంలో ఋషిరూపంలో శ్రీహయగ్రీవుడు అగస్త్యునికి శ్రీవిద్యను ఉపదేశించాడు. బ్రహ్మవిద్యాస్వరూపుడైన ఆశ్రీహయగ్రీవగురుమూర్తికి జయోస్తు.